ప్రతి మనిషికీ వద్దన్నా వచ్చిపడే వృద్ధాప్యం చర్మపు ముడతలలో అపారమైన అనుభవాన్ని , దానితోపాటే చెప్పలేనన్ని భయాందోళనలని , అభద్రతా భావాన్ని వెంట తెస్తుంది.
నిన్నటిదాకా ప్రపంచాన్ని గెలవగలనన్న ధీమాకి బదులుగా నేడు ఏదో కోల్పోతున్న భావన మనసును కలచివేస్తుంది. సమాజంలో తన కంటూ ఓ గుర్తింపునందించిన నాజూకైన శరీరం నిస్తేజం గా మారి నిరుత్సాహానికి , నిర్లిప్తతకు మనిషిని చేరువ చేస్తుంది.
నిన్నటి యువకులు నేటి వృద్ధులైనట్లే నేటి యువకులు రేపటి వృద్ధులన్న సంగతి తెలిసి కూడా వృద్ధులని నిరాదరణకి గురిచేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
పరిస్థితులు అనుకూలించక కొందరు, తమ పొట్టనే గడుపుకోలేక కొదరు, భార్య మాట జవదాటని భర్తలు కొందరు భర్తని ఒప్పించలెని భార్యలు కొందరు, పైసాకి కొరగావని కొందరు , తీరికలేదని కొందరు, వీలుకాదని కొందరు కారణాలేవైతేనేం.?
ఇంటికి పెద్ద దిక్కైన వృద్ధులని దిక్కులేని వారిని చేస్తున్నారు.ఏ దిక్కూ లేక రోడ్లపై తిరుగుత్రూ,రైళ్లలో, బస్టాపుల్లో గుళ్ళముందు ఎక్కడ పడితే అక్కడ ఎవైర్నైనా సరే చెయ్యి చాపి అర్థిస్తూ మంటగలిసిన మానవత్వానికి వారు మూగశాక్ష్యాలుగా మిగిలిపోయేవారెందరో.
అన్నీ ఉండి ఆందరిమధ్యా ఉన్నా ఆత్మీయతలకు , అనురాగానికి దూరంగా తియ్యటి పలకరింపుకు నోచుకోలేని వారు కొందరు.
ఈ రోజు అంతర్జాతీయ వృద్ధుల దినోవ్సం సందర్భంగా మీ వంతు తోడ్పాటుని మీ పరిధిలోని వృద్ధులను ఆప్యాయంగా పలకరించండి….
2 కామెంట్లు:
తాతతో వస్తే డిస్కౌంట్!
ఈసారి మీరు బయట ఏదో హోటల్ లో తినాలనుకునేటట్లయితే, మీ తాతగార్లు, నాయనమ్మ, అమ్మమ్మలను వెంట తీసుకువెళ్ళండి. కుటుంబ సభ్యులంతా సరదాగా గడపడమే కాకుండా కొన్ని రాయితీలు కూడా లభించవచ్చు.భారత హోటళ్లు, రెస్టారెంట్ల సమాఖ్య (ఎఫ్ హెచ్ఆర్ఐ) సీనియర్ సిటిజెన్లతో కలసి వచ్చే కస్టమర్లకు డిస్కౌంట్ సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నది.'మిగిలినవారంతా బయట హోటళ్లలో భుజిస్తుంటే వృద్ధులను సాధారణంగా ఇళ్ళలోనే ఉంచుతుంటారు కదా. అలా కాకుండా వృద్ధులను కూడా తమతో తీసుకువచ్చేలా కుటుంబాలను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం.ఆర్థిక స్తోమత గల వృద్ధుల జనాభా ఎక్కువగానే ఉన్న చండీగఢ్ నగరంలో కొన్ని హోటళ్లు ఇదివరకే ఈ పథకాన్ని ప్రారంభించాయి. అవి 15 శాతం నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. వృద్ధులు మాత్రమే వచ్చినప్పటికీ వారు డిస్కౌంట్ కు అర్హులవుతారు. కాని ఒక బృందంలో సభ్యులుగా వారు వచ్చినట్లయితే, డిస్కౌంట్ మొత్తం బిల్లుకు వర్తిస్తుంది. వయస్సు నిర్థారణకు ఎటువంటి పత్రాలను తీసుకురానవసరం ఉండదు. ఈ పథకాన్ని జయప్రదంగా అమలు పరచడానికై ఎక్కువ శాకాహార పదార్థాలను, చక్కెర వ్యాధి నిరోధక ఆహార పదార్థాలను ఆఫర్ చేస్తూ మెనూలను మార్చాలని కూడా పరిశ్రమ యోచిస్తున్నది.పాశ్చాత్య దేశాలలో ఇటువంటి డిస్కౌంట్లు సర్వసాధారణం.'కొన్ని కుటుంబాలలో వృద్ధులకు ఆదరణ కొంత తక్కువగానే ఉంటుంది. వారు తమ పిల్లలతో కలసి నివసిస్తున్నప్పటికీ వారిని ఇతర కుటుంబ సభ్యులు తమతో పాటు బయటకు తీసుకువెళ్ళడం అరుదు' అని 'వుయ్ కేర్' సంస్థకు చెందిన ఉమా గణపతి పేర్కొన్నారు. 'హోటళ్లవారు ఇటువంటి ప్రతిపాదనతో ముందుకు వస్తే లంచ్ కు లేదా డిన్నర్ కు తమ తాత నాయనమ్మలను తమ వెంట తీసుకువెళ్ళడానికి యువతరాన్ని ప్రోత్సహించినట్లు కాగలదు.http://www.telugupeople.com/news/NewsItem_55054.asp?newsID=55054
అమ్మ పిలుపున ననురాగ కమ్మ దనము
అమ్మ కెవరిల సాటియౌ యవని యందు
వివిధ కష్తాల కదలిలో విసుగు లేక
కూడు లేకను చివరకు వీడు ధరణి
కామెంట్‌ను పోస్ట్ చేయండి