Pages

25 అక్టో, 2009

ప్రతి అడుగూ ఓ ప్రశ్నే…

స్తొర్య్ ౩

 

 

ఎన్ని సాధించినా, ఎంత ఎదిగినా

అప్పుడప్పుడూ

నీలో ఒదగలేనంటుంది వెర్రి మనసు .

యాంత్రిక జీవనానికి పుట్టుబానిసవనీ

గుండెలేని భావాల గూడువౌతున్నావనీ

నిర్జీవంగా పడిఉన్న మనసు

అప్పుడప్పుడూ నిన్ను ధిక్కరిస్తుంది

మళ్ళీ నన్ను బతికించమంటూ

బ్రతిమాలుకుంటుంది

 

నిలకడలేని ఆలోచనలు

నిలబడలేని సిద్ధాంతాలమధ్య

మనసంతా అయోమయం ఆవరిస్తుంది.

ఉప్పెనలాంటి అసహనం పెల్లుబికి వస్తూ

ఉన్న ఒక్క నాలుకని

నియంత్రించుకోలేకపోతే,

తోచినట్టు దాన్ని ఆడనిస్తే

లెక్కలేనన్ని నాలుకలు ఒక్కసారిగా

ఎగబడి మీదపడి దాడి చేస్తాయి,

నిన్ను  మింగేస్తాయి

 

ప్రపంచాన్ని చూసేందుకు

నీకున్నది రెండే రెండుకళ్ళు

ఆ కళ్ళు మసకబారితే

దిక్కు తోచని  తరుణంలో

పొరపాటున దారితప్పితే పెడదారిన పడితే

ప్రతిక్షణం అదేపనిగా

నిన్ను పరిశీలించే ఎన్నెన్నో కళ్ళు

శూలాలై పొడిచేందుకు సిద్ధమౌతాయి.

 

flowers

 

అభిమానాలు అనుబంధాలు

అమృతప్రాయాలు

అన్ని రోగాలను శమింపజేసే ఔషథాలు

అనుక్షణం వాటిని వెంటపెట్టుకో

నీ ప్రయాణం లో తోడై వచ్చే బంధాలని

పవిత్రంగా కాపాడుకో

నిన్ను నువ్వుగా నిలబెట్టుకో

 

 

చూసే చూపు పలికే పలుకు

హృదంతరాలకి బదులిచ్చుకుంటూ

జాబిల్లి కురిపించే వెన్నెలలా

స్వచ్చమైన గంగా ప్రవాహంలా

సాగిపోతుంటే

విశాలమైన మనస్సాగర తీరాన

ప్రశాంత స్నేహ సౌథాన

వెలకట్టలేని కోకిల గానాలుగా

బంధాలు  ఆనందాలు

కలకాలపు కానుకలౌతాయనీ

ఎనలేని సంపదలౌతాయనీ గుర్తుపెట్టుకో….

నీ బాటను వెలుగుబాటగా మలచుకుంటూ

నీ వెలుగును ప్రపంచానికి పంచుకుంటూ ధైర్యంగా మునుముందుకు సాగిపో……….

9 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఎంత బాగా చెప్పారండీ!

Unknown చెప్పారు...

బాగుందండి.

జయ చెప్పారు...

మనసు కోతి లాంటిది కదండి మరి, అదుపులో పెట్టటమే కష్టం. అన్ని బాధలు మనసు మూలంగానే కదా! చాలా బాగా రాసారు.

SRRao చెప్పారు...

జీవిత సత్యాల్ని సరళమైన పదాలతో అందంగా చెప్పారు. అభినందనలు.

తెలుగుకళ చెప్పారు...

విజయమోహన్ గారూ, నరసింహ గారూ , జయ గారూ, రావు గారూ ధన్యవాదాలు.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

Chala bagundi. Alochanale mana mithrulu...mana satruvulu. keep it up.

కనకాంబరం చెప్పారు...

"నిజ జీవిత అనుభవసారం"
నిక్కచ్చిగా సరళ రీతిన చెప్పారు....అభినందలు.....నూతక్కి
ఉన్న ఒక్క నాలుకని
నియంత్రించుకోలేకపోతే,
తోచినట్టు దాన్ని ఆడనిస్తే
లెక్కలేనన్ని నాలుకలు ఒక్కసారిగా
ఎగబడి మీదపడి దాడి చేస్తాయి,
నిన్ను మింగేస్తాయి

Nrahamthulla చెప్పారు...

ఊరుమారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మరలిరాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతేలేదు

అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీజాతికొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్నీ పెరవారికొసగి
చీకటులలోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు వాడేది తనువే

మగవానికేమో ఒకనాటి సుఖమూ
కులకాంతకదియే కలకాల ధనమూ
తనవాడు వీడా అపవాదు తోడా
పదినెలలమోతా చురకత్తి కోతా
సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష --arudra

MAHESH VADDI... చెప్పారు...

ఆకాశాన చంద్రకళ...!
మీ అక్షరాలలోన భావకళ...!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి