20 నవం, 2009

ఎన్సీసీ ’యూత్ ఎక్సేంజి ప్రోగ్రామ్ ’ద్వారా రష్యా పర్యటించిన విజయవాడ విద్యార్థి… సుమంత్

2009  లో రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొనే మహత్తర అవకాశాన్ని పొంది ,  అక్కడ ఎన్ సీ సీ డైరెక్టర్ జనరల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఎంపికైన పదిమంది కేడెట్లలో  ఆంధ్రరాష్ట్రం నుండి ఎంపికైన ఒకే ఒక్కడిగా  విజయవాడ పీ.బీ. సిథ్థార్థా ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సుమంత్ రష్యా పర్యటన పూర్తి చేసి వచ్చాడు.  మన దేశం నుండి బయలు దేరిన   ఎన్.సీ.సీ. బృందం అక్టోబర్ 23 నుండి నవంబర్ 2 వరకు  యూత్ ఎక్సేంజి ప్రోగ్రామ్ ద్వారా  రష్యా కు వెళ్లి అక్కడి ఎన్సీసీ బృందాన్ని కలిసి రెండు దేశాల సాంస్కృతిక, ఆర్థిక , రాజకీయ, సామాజిక , విద్యా విషయాల  పై  తమ అవగాహనను పంచుకున్నాయి.

యూత్ ఎక్సేంజ్ ప్రోగ్రాం ద్వారా సుమంత్ పొందిన అనుభవాలను మీకోసం అందిస్తున్నాను.

ఎన్సీసీ ద్వారా ఎంత మంచి అవకాశాలు స్వాగతం పలుకుతాయో , ఎన్సీసీ ప్రాముఖ్య్తత, ఆవశ్యకత తెలియజెప్పటమే ఈ పోస్టు ఉద్దేశ్యం.

సుమంత్ గురించి:

సుమంత్: విజయవాడ పీ.బీ. సిద్ధార్థా ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న తెలివైన, చురుకైన విద్యార్థి.వినయవిధేయతలు , మంచి -మర్యాద తెలిసిన అబ్బాయి.

ఎన్సీసీలో రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనే అవకాశం లభించినపుడు అతని తండ్రి మరణించినప్పటికీ తల్లి ఓదార్పు, కళాశాల ప్రోత్సాహాలతో  క్యాంపును   విజయవంతంగా   పూర్తి చేసాడు.

యువతని ర్యాంకులు, ఉద్యోగాలే లక్ష్యంగా ఒత్తిడికి గురిచెయ్యకుండా ఉంటే, నచ్చిన అంశాల్లో వారినిఎదగనిస్తే వారి సత్తా ప్రపంచానికి తెలుస్తుంది.

సుమంత్ విషయంలో అతని కుటుంబం, కళాశాల బృందం, స్నేహితులు నిజంగా అభినందనీయులు.

సుమంత్ ఇచ్చిన పర్యటన  రష్యా వివరాలు:

 

రష్యా లోని మాస్కోలో రెడ్ స్క్వేర్ లో భాగమైన   క్రెమ్లిన్  చర్చి   ముందు అలెక్ అనే ఇంటర్పెటర్ తో ఎన్సీ్సీ బృందం..

IMG_0188

IMG_0250

త్రిత్యాకోవ్ ఆర్ట్ గ్యాలరీ ముందు  ఇండియన్ డెలిగేషన్ తో పాటు టూరిస్ట్ గైడ్ ఇరీనా అలెగ్జాండ్రోవా ( పైవరుసలో ఎడమ నుండి మూడవ వ్యక్తి)

 

IMG_0199

రెడ్ స్క్వేర్ లోని మరియొక భాగమైన మాస్కో స్టేట్ మ్యూజియం ముందు

 

రష్యన్ సాహిత్యకారులు, రష్యా పెయింటర్స్, యోధులు, మొదలగువారి పెయింటింగ్స్ ,

యుద్ధకాలపు వస్తువులు, రైఫిల్స్, పురాతన వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నాయి.

IMG_0256

మాస్కో బ్రిడ్జి పై సుమంత్:

ఈ నది పేరుతోనే  మాస్కో నగరానికి ఆ పేరు వచ్చింది,.

బ్రిడ్జి పైన ఉన్న ఇనుప చెట్లకు కొత్త గా పెళ్ళైన జంటలు వచ్చి ఆ చెట్టు కు తాళంకప్ప  వేసి  తాళం చెవులను మాస్కో నదిలో విసిరి వేస్తారు. ఇలా చేస్తే వారి బంధం అంత ధృఢంగా ఉంటుందని వారి విశ్వాసమట.

 

 IMG_0221

ఎన్సీసీ టీమ్ ( ఇండియన్ డెలిగేశన్ ) కు ఆతిథ్యమిచ్చిన  హోటల్ మాక్సిమా.

మాస్ల్కోకి ఇది ఉత్తరాన ఉంది.

IMG_0284

రష్యాలోనే అతి పెద్ద దైన క్రైస్ట్ ద సేవియర్ ’ చర్చి కి వెళ్ళే దారిలో రోడ్దుపై గల ఫిరంగి

 

 

IMG_0324 IMG_0329

అత్యంత పెద్దదైన చర్చి:

ఎత్తు 103 మీటర్లు. ఇటాలియన్ కోరర్ మార్బుల్స్ తో దీన్ని నిర్మించారు.

చర్చి లోపల ఏసుక్రీస్తు జీవిత విశేషాలను తెలియజెప్పే పెయింటింగ్స్ ఉంటాయి.

 

 

IMG_0289 ఇది లక్కీ బెల్ గా మాస్కోలో ప్రఖ్యాతి చెందిన రాగి , బంగారు మిశ్రమాల నిర్మాణం. ఇందులోని విరిగిపడిన ముక్కను ఎవరైతే  చేతులతో బాగా రుద్దుతారో వారికి అంత ఎక్కువ లక్ ( అదృష్టం ) వస్తుందని అక్కడి వారి విశ్వాసమట.

 

IMG_0341

ఇది మాస్కో స్టేట్ యూనివర్సిటీ .

1793 లో నే ఇది ప్రారంభించబడింది. ఇది రష్యాలోనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ.

ఫారిన్ లాంగ్వేజెస్ శిక్షణకు ఇది ప్రఖ్యాతి గాంచింది.

IMG_0347

మాస్కో లోనే అత్యున్నత మైన స్పారో హిల్ పైన ఇండియన్ డెలిగేషన్ టీం.

 


IMG_0406

 

రశ్యాలో విద్యా విధానం మన విధానాలకి పూర్తి భిన్నం. అక్కడ పాఠశాల  చదువు పూర్తిగా ఉచితం. ప్రయివేటు , ప్రభుత్వ పాఠశాలలు విడిగా ఉండవు. అన్ని  పాఠశాలలు ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగుతాయి.

చదువుకాకుండా ఇతర నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఆర్ట్స్ స్కూల్స్, హ్యాండీ క్రాఫ్ట్ స్కూల్స్  ప్రత్యేకంగా ఉంటాయి.

ఆర్ట్స్ స్కూల్స్ లో పిల్లలు సంగీతం , ఇన్స్ట్రుమెంట్స్, డాన్స్, పెయీంటింగ్ తదితర శిక్జణలు ఉచితంగా పొందవచ్చు.

పై పోటోలో ఉన్నది హ్యాండీ క్రాఫ్ట్  స్కూల్ లో శిక్షకురాలి తో సుమంత్:

వ్యర్థాలతో చక్కని వస్తువుల తయారీ ఇక్కడ నేర్పిస్తారు.ఇది చెర్న్యెంకా గ్రామం.అక్కడి పల్లెటూర్లు కూడా ఎంతో అభివృద్ధి చెందివుంటాయి.

.

IMG_0442

మొసాస్ట్రీ .. చర్చి.అక్కడ పూర్వం ఐదుగురు సాధువులు ఉండేవారట. అండర్ గ్రౌండ్ లో వారి నివాసాలున్నాయి. ఆర్ఠొడాక్ క్రిస్టియానిటీ కి చెందిన కట్టడమిది.

 

IMG_0475

రష్యాలోనే అతిపెద్ద ఇనుము ఉక్కు  కర్మాగారం:

అందులో 11,700 మంది వర్కర్లు పనిచేస్తున్నారు.

సాలీనా 3 లక్షల టన్నుల స్టీల్ ను  ఇక్కడ.  ఉత్పత్తి చేస్తారు  

4 స్టీల్ ఉత్పత్తి యంత్రాలు ఇక్కడ.   ఉన్నాయి.  వాటిలో ఒక్కొక్కటి నూట అరవై టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తుంది.

IMG_0551

ఒరోనెజ్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులతో మన బృందం.

IMG_0557

రీజినల్ హెడ్ ఆఫ్ యూత్ పాలసీ , బెల్గ్రాడ్ రీజియన్ కి అఫీషియల్ హెడ్ . .. ఇచ్చిన స్వాగత విందు లో

IMG_0562

అతిథులను సత్కరిస్తూ

IMG_0600

గత యుద్ధసైనికుల వస్తువులు గల మ్యూజియుం లో స్టెయిరీ ఆస్కాల్ నగరం లో

IMG_0601

IMG_0616

రష్యా సాంప్రదాయ వివాహ దుస్తుల మధ్య సుమంత్:

హాల్ ఆఫ్ సెరిమోనీ  ’ లో షాపింగ్ మాల్: ఖరీదైన దుస్తులు.

ఒక్కొక్కటి నలభై వెల రూబుల్స్. ( మన కరెన్సీ ప్రకారం దాదాపు అరవై నాలుగు వేల ఖరీదు ఉంటుందట.)

 

IMG_0661

ఇది స్కూల్ నంబర్ 27  ( స్కూల్ కి పేరు ఉండదు. నంబర్ లే )

IMG_0666 స్కూల్ సాంస్కృతిక కార్యక్త్రమాలలో..

IMG_0673

IMG_0697

కెడెట్ కోర్ ఆఫ్ రష్యా  ఆఫీసర్స్ తో.

IMG_0714

కాన్ఫరెన్స్ హాలు లో స్కూల్ నంబర్ 19  లో మన ఎన్సీసీ గురించి పవర్ ఫాఅయింట్ ప్రెజెంటే షన్ చూపించారు.

అక్కడి ఎన్సీసీ బృందంతో

IMG_0739

ఇండియన్ కెడెట్ల కోసం వారి డ్రిల్ ప్రదర్శిస్తున్న రష్యన్ కెడెట్స్

IMG_0753

ఫైర్ ఫైటింగ్ పార్టీ రెస్క్యుఊ ఆపరేషన్స్ ప్రదర్శించి చూపిన అనంతరం

IMG_0770

స్కూల్ నంబర్ 19  లో భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ’ మహా గణపతిం మనసా స్మరామి .. ’  గేయానికి నృత్యప్రదర్శ్న చేస్తున్న ఇండియన్ కెడెట్ ఆభా ( మహారాష్త్ర )

IMG_0785

భారత దేశం గురించి వర్ణీస్తూ పవర్ పాయింట్  ప్రజెంటేషన్ .

జాతీయ జెండా ఔన్నత్యాన్ని వివరిస్తున్న సుమంత్.

IMG_0970

మిలిటరీ ట్రెయినింగ్. సెంటర్ లో...

 

 IMG_1010

స్కూల్ నంబర్ 27 :రష్యన్లు చేతిలో బ్రెడ్ తో సాంప్రదాయ దుస్తులతో  అతిథులను ఆహ్వానిస్తారు. ఆ బ్రెడ్ ని తుంపుకుని మధ్యలోని సాల్ట్ను నంజుకుని తినాలి.

IMG_1037

రష్యాలో రెండ వ పెద్ద చర్చి .. స్పాసో ప్రవోగిన్స్కీ…

 IMG_1055 IMG_1041

  IMG_1044

స్పోర్ట్స్ & ఐస్ ప్యాలెస్

ఇక్కడ అన్ని రకాల ఇండోర్ , ఔట్డోర్ గేమ్స్ నేర్పిస్తారు.

ఐస్ స్కేటింగ్ ఇక్కడి ప్రత్యేకత.ఐదేళ్ళ వయసు పిలలు కూడా చక్కగా ఐస్ పై స్కేటింగ్ చేస్తారు .

 

 

 

IMG_1063

అక్కడి స్థానిక టీవీ చానెల్ ఇంటర్య్వూ లో ..

IMG_1105

ఎయిర్ రైఫిల్ చేస్తూ.. గురిపెడుతూ

IMG_1112

యాపిల్ డిస్ట్రిక్స్ అని పేరుపొందిన కొరోచీ యాన్స్కీ లో ఆర్టిఫిషియల్ ఆపిల్ ని బహూకరిస్తున్న డిస్ట్రిక్స్ ఎడ్మినిస్ట్రేటర్ : బెల్కన్ అలెగ్జాండర్.

 

రష్యా పర్యటన ద్వారా ఎన్నో విషయాలు తాను తెలుసుకుని మనకు అందించిన సుమంత్ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ……

   ఒక జర్నలిస్టుగా , ఉపాధ్యాయురాలిగా ఇటువంటి కథనాలు భవిష్యత్తులో ఎన్నెన్నో అందించాలని, యువతరానికి నావంతు ప్రోత్సాహాన్ని అందించాలని ఆకాంక్షిస్తున్నాను.

1 వ్యాఖ్యలు:

SRRao చెప్పారు...

పద్మ కళ గారూ !
బావుంది. మంచి కథనాన్ని అందించారు. సుమంత్ కి, మీకు అభినందనలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి