21 నవం, 2009

దేశం కోసం ఎన్ సీ సీ … యువసేన… నవంబర్ 22 NCC Day

దేశమాత కీర్తికిరీటాలుగా  జన్మ భూమి కీర్తి పతాకాన్ని విశ్వవీధిలో ఎగురవేసే సాహసోపేతమైన జీవనం గల ఉత్తమ పౌరులు ఎన్ సీ సీ కేడెట్లు.

 

ncc

 

ఇతరులకోసం బ్రతకడానికి ,ఆపత్సమయాల్లోపాణాలకుతెగించిసైతం బాధితులను ఆదుకొనడానికి  అవసరమైన ప్రేమ,కరుణ, దయ వంటి గుణాలతో కూడిన శిక్షణ పొంది  సమయపాలన, క్రమశిక్ల్షణలతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే తెగువ తో  ఇతరులకి సహకరించేందుకు సన్నద్ధమవుతారు .

దేశభక్తికి నిలువెత్తు రూపాలు వారు. ఆత్మవిశ్వాసానికి ప్రతినిధులు వారు .క్రమశిక్షణకు ప్రతిరూపాలు గా మాతృభూమి కోసం , ఆ భూమిపై పుట్తిన తోటి పౌరుల కోసం  తయారవుతున్న యువచైతన్యాలు వారు.

నవంబరు 22  ఎన్ సీ సీ దినోత్సవం సందర్భంగాఎన్ సీసీ శిక్షణ కు సంబంధించిన వివరాలతో ప్రత్యేకథనం.

 

అర్హతలు:

వయోపరిమితి:

ఎన్ సీ సీ లో చేరడానికి  కనీసం 13 సంవత్సరాలు నిండి ఉండాలి.

 

రెండు దశలు:

JD: జూనియర్ కేడెట్స్:/

పాఠశాల స్థాయి విద్యార్థులు (8 నుండి 10 తరగతుల మధ్య) ఈ శిక్షణ ను పూర్తి చేస్తారు. రెండు సంవత్సరాల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది.  ఇందులో బాలికలను JW జూనియర్ వింగ్ గా పిలుస్తారు.ఈ శిక్షణానంతరం A  సర్టిఫికేట్  ను ఇస్తారు.

SD :  సీనియర్ కేడెట్స్: /

16  నుండి 24  సంవత్సరాల మధ్య వయసు గల యువతీ యువకులు  సీనియర్ కేడెట్స్ గా శిక్షణ పొందటానికి అర్హులు. యువతులను  SW: సీనియర్ వింగ్ అనే పేరుతో పిలుస్తారు.

పదవతరగతి లోఫు NCC  లో చేరాలని ఉన్నా శిక్షణ పొందలేని వారు నేరుగా ఇంటర్, డిగ్రీ ల్లో మొదటి సంవత్సరాలలో అడ్మిషన్ పొంది BC సర్టిఫికేట్లు పొందవచ్చు.ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్య పొందుతున్న విద్యార్థులు కూడా NCC శిక్షణకు అడ్మిషన్ పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియ:

ప్రతి సంవత్సరం జూన్ నుండి జూలై మధ్య అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది.తమ పిల్లల్ని ఎన్ సీ సీ లో చేర్పించాలని ఉండి వారు చదువుతున్న పాఠశాలలో NCC  లేకపోతే సమీప బెటాలియన్స్ లో సంప్రదిస్తే. పిల్లల టాలెంట్,శారీరక మానసిక సామర్థ్యాల ఆధారంగా వారిని అందుబాటున్న కేంద్రం లో( ఖాళీలను బట్టి )శిక్షణకు అనుమతిస్తారు.


నగరంలోని బెటాలిన్లు:

విజయవాడలో మొత్తం 5  బెటాలియన్లు ఉన్నాయి. అవి:

1.17 ఆంధ్రా బెటాలియన్

2.4గర్ల్స్ బెటాలియన్

3.3RD ( 3 రిమోట్ అండ్ వెటర్నరీ రెజిమెంట్)

4.ఈఏఈ కంపెనీ (టెక్నికల్ విద్యార్థుల కోసం)

5.నేవెల్ యూనిట్

ఈ ఐదు బెటాలియన్లూ కరెన్సీ నగర్, బ్యాంక్ కాలనీ ప్రాంతాలలో నే ఉన్నాయి.

 

పాఠశాలలు, కళాశాలల్లో  ఎన్ సీ సీ విభాగాలు:

ప్రభుత్వ, ఎయిడెడ్  పాఠశాలల తో పాటు ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు కూడా తమ పాఠశాలల్లో NCC  ని ఏర్పాటు చేసుకోవచ్చు.

ప్రయివేటు యాజమాన్యాలు తమ విద్యా సంస్థల్లో NCC  ని ఏర్పరచుకోడానికి క్రింది నియమాలు పాటించాలి.

.

ANO:కేర్ టేకర్:

ఆయా పాఠశాలల్ల్లో ఎన్ సీ సీ కార్యకలాపాలు చూసేందుకు ప్రత్యేకించి ఒక వ్యక్తిని  నియమించాలి. కే ర్ టేకర్ వయస్సు 42 సంవత్సరాల లోపు వారై ఉండాలి. వీరికి మధ్యప్రదేశ్ లో ని  నాగపూర్ లో ఓటీఏ కామ్టీ లో ఎన్ సీ సీ 3  నెలల పాటు పత్యేక శిక్షణ నిస్తారు.

వీరి శిక్షణా కాలంలో రవాణా తదితర ఖర్చులకు  అయ్యే మొత్తాన్ని ప్రయివేటు యాజమాన్యాలే భరించాల్సి ఉంటుంది.ప్రభుత్వ పాఠశాలలు , కళాశాలల్లో  శిక్షణా వ్యయాలను ప్రభుత్వమే  భరిస్తుంది.

శిక్షణానంతరం వీరు కేర్ టేకర్లుగా, ఎన్స్ సీ ఆఫీసర్లు గా తమ తమ పాఠశాలల్లో అదనపు విధులు నిర్వహిస్తారు . వీరికి నెలకు జేడీ ల శిక్షకులకైతే ఏడువందల రూఫాయలు, ఎస్ డీల శిక్షకులకైతే వెయ్యి రూపాయలు చెల్లిస్తుంది.( ప్రయివేటు యాజమాన్యాలయితే ఈ గౌరవ వేతనన్ని తామే చెల్లించాల్సి వస్తుంది.)

కేడెట్ రిఫ్రెష్ మెంట్ అలవెన్సులను ( కెడేట్ కి ఆరు రూఫాయల చొప్పున ), క్యాంపు ఖర్చులు కూడా ప్రయివేటు యాజమాన్యాలు తమే చెలించాలి.

ట్రెయినింగ్ కాలంలో క్యాంపుల ఖర్చులు కూడా భరించవలసి ఉంటుంది.

 

జేడీ కి    15 పెరేడ్లు చొప్పున ఒక్కొక్క  రోజుకి మూడు పిరియడ్ల చొప్పున సంవత్సరానికి మొత్తం 150 పిరియడ్ల తో పాఠశాలలు ప్రణాళీక రూపొందిస్తాయి  . పర్మినెంట్ ఇన్స్ట్రక్టర్లు గా నియమించబడిన  ఆర్మీస్టాఫ్ ఫీల్డ్ క్రాఫ్, బ్యాటిల్ క్రాఫ్, వెపన్ట్రెయినింగ్   నేర్పిస్త్తారు. థియరీ పార్ట్ అంతా పాఠశాల లో ఉన్న ఎన్ సీసీ ఆఫీసర్  అందిస్తారు.

టైమింగ్స్:

కళాశాలలు ఆదివారాల్లోనూ

స్కూల్స్ లో ఉదయం 7-9, సాయంత్రం పూట 5 – 7  గంటల మధ్య నిర్వహిస్తారు.  ఇన్స్ట్రక్టర్లు శిక్షణ ఇస్తుంటారు.ఇన్స్ట్రక్టర్లు, హవాల్దారులు, సిబ్బంది  ఈ శిక్షణ్ లో కెడేట్ల కు సహాయ సహకారాలు అందిస్తారు.

క్యాంఫ్:

ప్రతి విద్యార్థి ప్రతి సంవత్సరం ఒక కాంప్ చెయ్యాలి. పది రోజుల పాటు అక్కడే ఉండాలి. పైరింగ్, డ్రిల్ ప్రాక్టీస్,వెపన్ ట్రెయినింగ్ తో పాటు  సామాజిక , ఆరోగ్య అంశాలపై గెస్ట్ లెక్చర్స్  కి వీరు హాజరౌతారు.

పరీక్షా విధానం:

ఫిబ్రవరి మొదటివారం లో A  సర్టిఫికేట్ కు, చివరి వారంలో, మార్చి మొదటి వారంలో B, C సర్టిఫికేట్లకు పరీక్షలు నిర్వహిస్తారు.ప్రాక్టికల్స్, రిటెన్ విధానాలలోప్రీక్షలు జరుగుతాయి.

రిపబిక్ డే పెరేడ్:

మే నెలలఓ నిర్వహించే క్యాంఫ్ లో విద్యార్థులను ఎంఫిక చేస్తారు. బెటాలియన్ల  స్థాయి నుండి గ్రూపులు , తరువాతా ఇంటర్గ్ రూఫ్ పోటీల ద్వారా ఎంపిక చేశ్తారు.

మినిమం 174     5/8 ఎస్ డి లకి ,162 cms.  ఉండాలి. డ్రిల్, వివిధ సాంస్కృతిక కార్యక్త్రమాలలో పిల్లల ప్రతిభాపాటవాల ఆధారంగా , మంచి ఆంగ్ల భాషలో మాట్లాడగలగటం  వంటి అంశాల ఆధారంగా పిల్లల్నిరిపబ్లిక్ డే పెరేడ్ కు ఎంపికచేస్తారు.

యూత్ ఎక్శేంజ్ ప్రోగ్రాం:

రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొన్న తరువాత అక్కడి నుండి యూత్ ఎక్సేంజి కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా  మన యువత వివిధ దేశాలకు వెళ్ళీ ఆయా దేశాలలో NCC , ఇతర అంశాలైన విద్య , వైద్యం , సామాజికస్థితిగతులు జాతీయస్మైక్యతవ్ంటి అంశాల పై అవగాహన పొందుతారు.ప్రతిసంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా యువత వివిధ దేశాలకు పర్యటిస్తుంది.

NCC లక్ష్యం:

  క్రమశిక్షణ, దేశభక్తి  , బధ్యత వంటి ఉత్తమ పౌర లక్షణాలతో పాటు దేశంలోఎ క్కడ ఎటువంటి పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించటాం , తక్షణ సాయం అందించటం వంటి కార్యక్రమాల ద్వారా  సేవనందిస్తారు.

నాయకత్వలక్షణాలు , ఉన్నత వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం సమయ పాలన వంటి మంచి లక్షణాలు అలవడతాయి.

NCC సర్టిఫికేట్ ఉన్నవారికి అవకాశాలు:

 

C సర్టిఫికేట్ పూర్తి చేసిన వారికి  అకడమిక్ గా మంచి అవకాశాలు ఉంటాయి.

వీరికి ఆర్మీలో  ఎన్రోల్మెంటుకి వ్రాత పరీక్ష ఉండదు. ఇంటర్వూ పూర్తి చేస్తే సరిపోతుంది.  ఆఫీసర్ల నియామకంలో NCCకి 50 సీట్లుంటాయి.  50%డిగ్రీ మార్కులు, బీ గ్రేడింగ్, సీ సర్టిఫికేట్ ఉంటే వారు డైరెక్ట్ సర్వీస్ సెలెక్షన్ బోర్దు ద్వారా ఎంపికకు వెళతారు.

వివిధ ఉద్యోగాలలో ఎన్ సీ సీ అభ్యర్థులకు ప్రత్యేకించి రిజర్వేషన్ ఉంటుంది.

 

కమ్యూనికేష్గన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకుంటూ , పోటీ వాతావరణంలో ఆత్మవ్ిశ్వాసం పెంపొందించుకోవాలన్నా , జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్న పొందాలన్నా ఎన్సీ సీ ఉత్తమ మార్గం.

 

ఎన్సీసీ లక్ష్యం
యువతలో్ జాతీయ సమైక్యతా సాధనకు అవసరమైన లౌకిక దృక్పథం, స్వార్థ చింతన లేని సేవా గుణం, సాహసోపేతమైన జీవనం , ధైర్య సాహసాల తో పాటు దేశ రక్షణకు అవసరమైన పటిష్టవంతమైన సైనిక వ్యవస్థ నిర్మాణం ఎన్సీ సీ లక్ష్యాలు.

NCC Song:

The song Kadam Milake Chal was the NCC song, but now it is the song Hum Sab Bhartiya Hain. It is as follows :

Hum Sab Bhartiya Hain (2)
Apni Manzil Ek Hain
ha ha ha Ek Hain Oh oh oh Ek Hai
Hum Sab Bhartiya Hain ''

Kashmeer Ki Dharthi Rani Hain
Sartaj Himalay Hain
Sadiyon se Hamne Isko Apne
Khoon Se Pala Hain
Desh Ki Raksha Ki Khathir
Hum Shamshir Utha Lenge...(2)
Bikhre Bikhre Taare Hain Hum
Lekin Jhilmil
Ek Hain ha ha ha Ek Hain Oh oh oh Ek Hain...
Hum Sab Bhartiya Hain

Mandir Gurudwarein Bhi Hai Yahan
Aur Masjid Bhi Hai Yahan
Girija Ka Hain Ghadiyal Kahin
Mullah Ki Kahin Hai Azaan
(2)
Ek Hi Apna Ram Hain
Ek Hi Allah Tala Hain... (2)
Rang Birange Deepak Hain Hum
Lekin jagmag
Ek Hain ha ha ha Ek Hain Oh oh oh Ek Hain...
Hum Sab Bhartiya Hain (4)

ఎన్ సీ సీ క్యాంపులు:

రిపబ్లిక్ డే క్యాంపు

తల్ సైనిక్ క్యాంపు

ఆర్మీ అటాచ్మెంట్ క్యాంపు

వార్షిక శిక్షణా క్యాంపు

వాయు సైనిక క్యాంపు

నౌ సైనిక క్యాంపు

అడ్వాన్స్ లీడర్షిప్ క్యాంపు

జాతీయ సమైక్యతా క్యాంపు

రాక్ క్లైంబింగ్ క్యాంపు

ఆల్ ఇండియా ట్రెక్కింగ్ క్యాంపు

షిప్ అటాచ్మెంట్ క్యాంపు

స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్స్

కంబైన్శ్ యాన్యువల్ ట్రెయినింగ్ క్యాంప్

బేసిక్ లీడర్ షిప్  కాంప్

ఎన్సీ సీ ప్రమాణం

(Oath)

I do hereby solemnly promise that I will serve my motherland most truly and loyally and that, I will abide by the rules and regulations of the National Cadet Corps. Further under the command and control of my commanding officer I will participate in every camp most sincerely and wholeheartedly.

ఎన్సీసీ ప్రతిఙ్ఞ :

(Pledge)

We the cadet of the National Cadet Corps, do solemnly pledge that we shall always uphold the unity of India. We resolve to be disciplined and responsible citizen of our nation. We shall undertake positive community service in the spirit of selflessness and concern for our fellow beings.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి