విరోధిని జయించాం
విరోధాలను వదిలేద్దాం !
వికృతికి చేరుకున్నాం
వికృతాలను అరికడదాం !
కారపు సవాళ్లనెదుర్కొని
చేదు నిజాలు గ్రహించి
ఉప్పని తప్పులు దిద్దుకుని
ఒగరు పొగరు నడచి
తియ్యదనపు పలుకులతో
పులుపు పులకింతలతో
షడ్రుచుల సందేశం
అరిషడ్వర్గాల వైరాగ్యం
మానవత్వపు మహోన్నత మార్గం
శతవసంతాల జీవన సరాగాలకు ఇదే ఇదే శ్రీకారం !
మితృలందరికీ వికృతినామ సంవత్సర శుభాకాంక్షలు !
1 కామెంట్‌లు:
అమ్మా!
మీ హృదయాంతరాళాల్లోంచి ఉప్పొంగి వచ్చినా మీ హృదయ గత భావం తేట తేట తెలుగు తీయదనాన్ని షడ్ రుచులలో మేళవించి కడు హృద్యంగా ఉందమ్మా!
నాకు సహజంగా వచన కవిత అంటే అంత రుచించదు. మీ రచనలో మాధుర్యాన్ని చూసి నా అభిప్రాయం కొంత మార్చుకొని ఇట్లాంటివి కూడా ఒక సారి చదివి చూడాలని అనిపించింది.
ధన్య వాదములు.
పద్యరచన అలవరచుకొని మాబోంట్లకు ఆనందం కలిగించ గలందులకు ఆకాంక్షిస్తున్నాను.
జైహింద్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి