Pages

28 సెప్టెం, 2010

పరుగో పరుగు…….

mother_tree_with_daffodils_and_shad

ఎప్పుడూ పరుగులే

ఎప్పుడూ ఉరుకులే

చంటోడి నుంచి

ముసళాళ్ల దాకా

అందరూ బిజీ… బిజీ…

ఎప్పుడు ఎవర్ని కదిపినా

“నేను చాలా బిజీ”

 

ఆయాసం రాని పరుగు

అలుపు లేని పరుగు

ఆలోచన లేని పరుగు

అర్థం లేని పరుగు

అందర్నీ దూరం చేసే పరుగు

 

కంటి నిండా కునుకు

తియ్యనివ్వని పరుగు

కడుపునిండా తృప్తిగా

తిననివ్వని పరుగు

ఎక్కడికో ఈ పరుగు

ఎందుకో ఈ పరుగు…..?

 

 

క్షణం నిలకడగా

నిలవనివ్వని పరుగు

అనుక్షణం ఆందోళన పరిచే పరుగు

అశాంతికి మూలమీ పరుగు…!

 

మీరూ పరుగు పందెంలో

పరుగెడుతున్నారా?

ఒక్కసారి ఆగి

పరిశీలించుకోండి…

మీకు తెలియకుండానే

మీరూ  అలసిపోయారు

ఆందోళన పరిచే

ఆలోచనల్ని ఓ క్షణం పాటు

బలవంతంగా  బంధించి

ప్రశాంతంగా

కనురెప్పలకి

ఓ చిన్ని జోల పాడి

ఉన్నచోటే్ హాయిగా మీ మనసును

విశ్రమించనివ్వండి

దుబుకు దుబుకున

అల్లాడే వెర్రి గుండెకి

కాస్త ఊరటనివ్వండి….

( మీకిష్టమైన అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ …….. కాస్సేపు రిలాక్స్… అవ్వండి…!)

3 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

బాగుంది .
ఫొటో చాలా బాగుంది .

నారాయణ చెప్పారు...

బాగు బాగు.. అదృష్టం బాగుంది గనక నేను అంతగా పరుగులెత్తటం లేదు గానీ, పరుగెత్తాల్సి వస్తే మటుకు చాలా కష్టపడతాను.

జ్యోతిర్మయి చెప్పారు...

కళ గారూ.. మీ గురించి వనజ గారి బ్లాగులో చూశాను.కవిత బావుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి