Pages

28 సెప్టెం, 2010

పరుగో పరుగు…….

mother_tree_with_daffodils_and_shad

ఎప్పుడూ పరుగులే

ఎప్పుడూ ఉరుకులే

చంటోడి నుంచి

ముసళాళ్ల దాకా

అందరూ బిజీ… బిజీ…

ఎప్పుడు ఎవర్ని కదిపినా

“నేను చాలా బిజీ”

 

ఆయాసం రాని పరుగు

అలుపు లేని పరుగు

ఆలోచన లేని పరుగు

అర్థం లేని పరుగు

అందర్నీ దూరం చేసే పరుగు

 

కంటి నిండా కునుకు

తియ్యనివ్వని పరుగు

కడుపునిండా తృప్తిగా

తిననివ్వని పరుగు

ఎక్కడికో ఈ పరుగు

ఎందుకో ఈ పరుగు…..?

 

 

క్షణం నిలకడగా

నిలవనివ్వని పరుగు

అనుక్షణం ఆందోళన పరిచే పరుగు

అశాంతికి మూలమీ పరుగు…!

 

మీరూ పరుగు పందెంలో

పరుగెడుతున్నారా?

ఒక్కసారి ఆగి

పరిశీలించుకోండి…

మీకు తెలియకుండానే

మీరూ  అలసిపోయారు

ఆందోళన పరిచే

ఆలోచనల్ని ఓ క్షణం పాటు

బలవంతంగా  బంధించి

ప్రశాంతంగా

కనురెప్పలకి

ఓ చిన్ని జోల పాడి

ఉన్నచోటే్ హాయిగా మీ మనసును

విశ్రమించనివ్వండి

దుబుకు దుబుకున

అల్లాడే వెర్రి గుండెకి

కాస్త ఊరటనివ్వండి….

( మీకిష్టమైన అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ …….. కాస్సేపు రిలాక్స్… అవ్వండి…!)

16 జులై, 2010

వారాహి పంచమి… పర్వదినం

DSCN0287

 

 

ఈ రోజు వారాహి పంచమి.దేవీ ఉపాసకులకు అతి ముఖ్యమైన రోజు. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి,దండనాధ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం,చక్రం,నాగలి,గునపం,అభయ వరదాలతో మహిష వాహనంపై  దర్శనమిస్తుంది. బ్రాహ్మి,మాహేశ్వరి, కౌమారి,వైష్ణవి, వారాహి.,ఇంద్రాణీ,చాముండి, వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు.

19 జూన్, 2010

ఏవీఎస్ గారొచ్చేశారహో….(మన బ్లాగ్లోకం లోకి)

’అసలు తుత్నాత్నమి అంతే…’   మనం కృష్ణాష్టమి జరుపుకున్నన్నాళ్ళూ ఈ డైలాగ్ మర్చిపోలేం.

గోడ కనిపిస్తుందా ? నీడ కనిపిస్తుందా ? గాలి కనిపిస్తుందా ?…. ’ గాలి కనిపించడమేమిటి? ….  ఎందుకు కనిపించదు ?   ఇలాంటి ప్రశ్నలు ఏవిఎస్ గారి శుభలగ్నం నుండి బాగా ఫేమస్ అయ్యిపోయాయి కదా !

అసలు ఆ యాక్సెంటు, ఆ డైలాగ్ డెలివరీ, ఆ మానరిజమ్స్, క్రియేటివిటీ… ఎంత కర్కశహృదయులైనా కడుపుబ్బ నవ్వాల్సిందే. అదీ ఏవీఎస్ గారి స్పెషాలిటీ.

ఇంతకీ ఇప్పుడు ఏవీఎస్ గారి ప్రస్తావన ఇంత సడన్ గా ఎందుకట ? అనుకుంతున్నారా ?

అదే చెప్తున్నా …

నిత్యం షూటింగ్స్ , రిహాల్సల్స్ తో బిజీ గా ఉండే ఏవీఎస్ గారు కూడా  మన బ్లాగ్స్పాట్ కి వచ్చేశారు. తెలుసా ?

మరి ఏవీఎస్ గారి కబుర్లు … ఎంజాయ్ చేస్తూ, వారి భావాలను , అభిప్రాయాలను పంచుకోవాలనుకుంటే మాత్రం ….

 

ఇదుగో ఇక్కడ లింక్ ఇచ్చేస్తున్నా !

మరి ఏవీఎస్ గారికి  వెల్కమ్ చెప్పేద్దామా మన బ్లాగ్లోకానికి….

http://avsfilm.blogspot.com  

( correction made in url : u can view the blog now. no doubt it’s the blog of  sri AVS only)