కాళ్ళా గజ్జావయసు
కండెలమ్ముకుంటోంది
బలపం పట్టాల్సిన చేతులు
నాలుగు రాళ్ళ కోసం
తంటాలుపడ్తున్నాయి
కలలు కనే కళ్ళు
భవిష్యత్తును
కానలేకపోతున్నాయి.
లేలేత చెక్కిళ్లు
ఎండకు మగ్గిపోతున్నాయి
ఇంతమంది మధ్యలో
ఈ పెద్దమనిషి కూడా
పోటీ పడి మరీ
సంపాదించేయాలని
ఆరాటపడుతోంది.... !
....................పద్మకళ
6 కామెంట్లు:
బాలకార్మికులను చూస్తే చాలా బాధేస్తుందండి. మీస్పందన బాగుంది
బాగుంది
నిజంగానే బాలకార్మిక వ్యవస్థ నశించాలి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపలేకపోతుంది. ఉన్న చట్టాలు సరిపోతాయి కానీ వాటిని కఠినంగా అమలు చేయాలి.
బాధగావుంది
bala kaarmikula gurinchi mee spandana baavundy..
చాలా బాగా రాశారు కళ గారు. బాల కార్మికుల నిర్మూలనకై ఎన్ని చట్టాలు వచ్చనా ఇంకా ఈ పరిస్థితి కొనసాగుతోందంటే చాలా బాధాకరం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి