5 డిసెం, 2009

నా చిట్టి చెల్లి పుట్టిన రోజు… ఈ రోజు…

lavanya 

చారెడేసి కళ్ళు

చక్కని చెక్కిళ్ళు

కంటి రెప్పల చాటున

కోపతాపాలు,అలుకలు

 

ఓసారి హరివిల్లుగా

ముద్దుమోముపై

మురిపాలు చూపిస్తుంది

అరవిచ్చుకున్న తెల్లని సుకుమార

సుమాలు రంగరించి

వెండివెన్నెల నవ్వుల జల్లు కురిపిస్తుంది

ఓ సారి అపర కాళికగా

చండీశ్వరిగా గర్జిస్తుంది

క్షణాల్లో మమ్మల్ని గాభరాపెట్టేస్తుంది

 

మంచి - చెడు, కష్టం- సుఖం

ఓర్పు-ఓదార్పు, నవ్వు-ఏడ్పు

ప్రేమ-ద్వేషం , గెలుపు-ఓటమి

జంటపదాలైనా ఒకదాని వెంట ఒకటి

వెంటవచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా

నువ్వు – నేను ఎప్పటికీ

ఇంతే..

 

నాచిట్టి చెల్లీ – బంగరు తల్లీ

నీ నవ్వు నాకు ప్రాణం

నువ్వు నాకు

దేవుడిచ్చిన వరం

 

సుప్రభాతాలు స్వాగతిస్తుండగా

ఎదలయలు నీ రాకకై ధ్వనిస్తుండగా

మా పాలిట వెలుగువై

మా ముంగిట రంగవల్లివై

పదముగ్గురు అన్నదమ్ముల , ఎనమండుగురు అక్కల

చిట్టి చెల్ల్లి గా పుట్టిన పసిపాపవి !

ఏ నాటికీ నువ్వు మా కనుపాపవి !

 

పుట్టిన రోజు శుభాకాంక్షలతో

బంగరు భవిత నీ వెంట నడిచి రావాలని

కలకాలం సుఖసంతోషాలతో

నిండునూరేళ్ళూ వర్థిల్లాలని

ఆశీర్వదిస్తూ…

లావణ్యం గా లావణ్య నవ్వుల కోసం…ఎదురుచూస్తూ

నీ అక్క

17 వ్యాఖ్యలు:

Tekumalla Venkatappaiah చెప్పారు...

చిరుత నవ్వుల తల్లివె చిలిపి పనుల
లలిత లావణ్య లహరివై వెలిగిపొమ్ము
పుట్టె మీఇంట దేవత పుణ్య వరమె!
నిండు నూరేళ్ళు వర్ధిల్లునిలను తల్లి!

lavanya చెప్పారు...

thanks and mee blessings nake epudu todu vuntaee andi

శిశిర చెప్పారు...

మీ చెల్లి పేరు లావణ్యాండి? మీ చెల్లెలికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

santhosh చెప్పారు...

శుభాకాంక్షలు
నా తరపు నుంచి కూడా...

అజ్ఞాత చెప్పారు...

లావణ్యకు ( పేరు అదేకదా!) పుట్టినరోజు శుభాకాంక్షలు

జ్యోతి చెప్పారు...

Happy birthday to ur sister

జయ చెప్పారు...

మీ బంగారు ముద్దుల చెల్లికి మా శుభాకాంక్షలు కూడా అందజేయండి.

durgeswara చెప్పారు...

yasasvee bhava


mee chelliki cheppamdi

Srujana Ramanujan చెప్పారు...

Many happy return of the day to your sister Padma Kala garu.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీ బంగారు ముద్దుల చెల్లికి మా శుభాకాంక్షలు.

తెలుగుకళ చెప్పారు...

మితృలారా ! మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు !

అజ్ఞాత చెప్పారు...

Show my heartiest blessings & happy birth day wishes to our beloved sweet sister........... Big Brother Prasad Raju, Vidya, Uma

APNEW చెప్పారు...

మీ చిట్టి చెల్లేలకు నా హృదయ పూర్వక జన్మదిన శుభాకంక్షలు.

vassu చెప్పారు...

Manasuloni bhavalu pedavi paina matalayi madini cheri tana kalamuto rupudiddukunna maduramina vakyalku.....oka chitti chelliki oka banagru akka pamapina jnamadina kanuka.........oka manchi veduka.......itlu...lakshmi..

Hi Lav....belated happy Birthday.....

vassu చెప్పారు...

....
Priyamaina Lavanyaku.....
mnasuloni bhavalu madini cheri tana maduramaina kalamu nundi veluvadina tiyyanaina vakyalu ninu paravasimpa chesayani korukuntu...neeku na hrudya poorvaka Janmadina Subhakankshalu.......ee subhadinamuna....

And congrates for your sister for the great conversion.....have a great day my dear Lav

శ్రీధర్ చెప్పారు...

ఫద్మకళ గారూ, మీ చిన్నారి చిట్టి చెల్లికి ఫుట్టిన రోజు శుభాకాంక్షలు.మీ రెక్కలు ఫైన కూడ కామెంట్ పోస్టు చేసాను. కాని అది ఎందుకో ఫబ్లష్ కాలేదు. బహుశా నాకు చేయడం రాలేదనుకొంటా!నా బ్లాగులో కొత్త కథ ఫెట్టాను.ఫేరు ఖర్జూరం చదివి చెఫ్ఫండి.

శ్రీధర్ చెప్పారు...

ఫద్మకళ గారూ! మీచిన్నారి చిట్టి చెల్లికి ఫుట్టిన రోజు శుభాకాంక్షలు. నా బ్లాగ్లో కొత్త కథ 'ఖర్జూరం' ఫెట్టాను.చూసి చెఫ్ఫండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి